Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్పీ విమర్శలకు ఎర్రోళ్ల కౌంటర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గర్భిణీలు, బిడ్డ తల్లులను పెట్టే పౌష్టికాహారంపైనా గజదొంగల ముఠా కన్నేసిందంటూ బీయస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలను తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పని చేసిన అనుభవమున్న వ్యక్తిగా నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ప్రాజెక్ట్ విలువ రూ.50 కోట్లు మాత్రమేననీ, ఒక్కో కిట్ అంచనా విలువ రూ.1,962 అని తెలిపారు. కనీసం ఐదేండ్ల అనుభవం, 25 శాతం మార్కెట్ షేర్ ఉండాలంటూ టెండర్ నిబంధనల్లో ఉందని గుర్తుచేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్ఐఎన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే న్యూట్రిషనల్ పౌడర్ ప్రమాణాలను నిర్దేశించినట్టు స్పష్టం చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందనీ, దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడటం న్యాయస్థానాన్ని అవమానించడమే అవుతుందని తెలిపారు.