Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దుబ్బాకలో మూడు వేల ఓట్లతో డిపాజట్ కోల్పోయి బీజేపీని గెలిపించినందుకు ఆపార్టీకి ఎంతకు అమ్ముడు పోయావని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఆ పార్టీకి ఎంతకు అమ్ముడు పోయావంటూ శనివారం ఒక ప్రకటనలో నిలదీశారు. రేవంత్‌రెడ్డి నోరును అదుపులోపెట్టుకోవాలనీ, క్షమాపణ చెప్పే వరకూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు టీఆర్ఎస్ అధినేతకు అమ్ముడు పోయారంటూ మునుగోడు నియోజకవర్గ పర్యటనలో రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఆయన నోటి దురుసుతనానికి, వాచారతకు నిదర్శనమని తెలిపారు.
క్రికెట్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌లో టికెట్ల విక్రయంలో జరిగిన అక్రమాలు, తొక్కిసలాట వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. క్రికెట్, ఫుట్‌బాల్, హాకి క్రీడా సంస్థలలో రాజకీయ జోక్యం, ప్రమేయం కారణంగానే అవినీతి అక్రమాలకు తావిచ్చినట్టు కనిపిస్తున్నదని విమర్శించారు.