Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాంకేతిక కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కనీసం జీతాలు చెల్లించడం లేదని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ విమర్శించారు. కాలేజీల్లో పనిచేస్తున్న 116 మంది ఫ్యాకల్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలను సేకరించామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం జీతాలు చెల్లించడం లేదంటూ, కాగితంపై వేతన సంఘ సిఫారసులుంటాయనీ, ప్రత్యక్షంగా అవి అమలు కావడం లేదని పేర్కొన్నారు. తప్పుడు ఫార్మ్-16లు రూపొందిస్తున్నారని వివరించారు. గత కొన్నేండ్లుగా రాష్ట్రంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తెచ్చామని తెలిపారు. అధ్యాపకుల బ్యాంక్ ఖాతాల్లో జీతాలను జమ చేసి ఆ తర్వాత తిరిగి తీసుకుంటున్నాయని విమర్శించారు.