Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మానవ వనరుల అభివృద్ధికై 2022-23లో 30,625 మందికి శిక్షణ ఇవ్వాలని న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శిక్షణ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అవుతున్న ఇంజినీర్లు, టెక్నికల్ పర్సన్స్‌కు 30 రోజులు , దళితబంధు లబ్దిదారులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. శనివారంనాడిక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శివ కేఎస్ శ్రీనివాసరాజు, డైరెక్టర్ జనరల్ బిక్షపతి, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (తెలంగాణ) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
16 మున్సిపాల్టీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
రాష్ట్రంలోని 16 మున్సిపాల్టీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రానికి అవార్డులు దక్కడం పట్ల పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. అక్టోబరు 1వ తేదీ డిల్లీలో ఈ అవార్డుల ప్రధానం చేస్తారు. ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి, సంస్కరణల ఫలితంగానే ఈ అవార్డులు లభించాయని మంత్రి చెప్పారు.
అవార్డులకు ఎంపికైన మున్సిపాల్టీలు ఇవే..
1.ఆది బట్ల మున్సిపాలిటి 2. బడంగ్పేట్ 3. భూత్పూర్ 4. చండూర్ ి 5. చిట్యాల 6. గజ్వేల్ 7. ఘట్ కేసర్ 8. హుస్నాబాద్ 9. కొంపల్లి 10. కోరుట్ల 11. కొత్తపల్లి 12.నేరుడుచర్ల 13. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 14. సిరిసిల్ల 15. తుర్కయాంజల్ 16. వేములవాడ
సీఎం అభినందనలు
స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు అవార్డులు గెలుచుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు.