Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం మత్తులో ఉండటంతో సఖీ సెంటర్కు తరలింపు
- లైంగికదాడి, కిడ్నాప్ కేసు నమోదు
నవతెలంగాణ-జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడిగి గ్రామ శివారులో అచేతనంగా పడి ఉన్న ఓ మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను పోలీసులు సఖీ సెంటర్కు తరలించారు. డీఎస్పీ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో శనివారం ఓ మహిళను కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే సదరు మహిళ మద్యం మత్తులో ఉండడంతో పోలీసులు సఖీ సెంటర్కు తరలించారు. ఆ మహిళ సికింద్రాబాద్లోని తిరుమలగిరి లాల్ బజార్ వాసిగా పోలీసులు గుర్తించారు. ఆమె సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాఫ్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా లైంగిక దాడి, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.