Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురుకులాల్లో 9,096 ఉపాధ్యాయ ఖాళీలకు జూన్ 17న ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది జరిగి నాలుగు నెలల కావస్తున్నా ఇంతవరకు గురుకుల బోర్డ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార ని విమర్శించారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. టెట్ ముగియగానే 12 వేల ఉపాధ్యాయ ఖాళీలకు టీఆర్టీ నోటిఫికేషన్ అంటూ పలుసార్లు ప్రభుత్వం, మంత్రులు,అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు. అయినా ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపొవడం సరైంది కాదని తెలిపారు. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించి టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.