Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలాలను గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.
అయితే వాటిని అధికారికంగా గుర్తిస్తూ గెజిట్ ముద్రణ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.
జిల్లాలవారీగా కొత్త రెవెన్యూ మండలాలు ఇవే...
1. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి , భీమారం
2. సంగారెడ్డిలో నిజాంపేట్ 3. నల్లగొండలో గట్టుప్పల్
4. మహబూబాబాద్‌లో సీరోలు, ఇనుగుర్తి.
5. సిద్దిపేటలో అక్బర్పేట్ -భూంపల్లి, కుకునూరుపల్లి
6.కామారెడ్డిలో డోంగ్లి
7. మహబూబ్‌నగర్‌లో కౌకుంట్ల
8. నిజామాబాదు జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్ ,
సాలూరా కొత్త రెవెన్యూ మండలాలుగా ఏర్పడ్డాయి.