Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యకు టీపీటీఎల్ఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దసరా సెలవులివ్వాలని తెలంగాణ ప్రయివేట్ టీచర్స్, లెక్చరర్స్ సంఘం (టీపీటీఎఫ్ఎల్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను మంగళవారం హైదరా బాద్లో ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎ విజరుకుమార్, మేడ్చల్ జిల్లా నాయకులు సైదులు, శ్రీనివాస్, శివ ప్రచండ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల 25 నుంచి వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకు రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని తెలిపారు. దాదాపు మెజార్టీ పాఠశాలలు సెలవులిచ్చా యని గుర్తు చేశారు. కానీ కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఇంకా ఆన్లైన్లో తరగతులను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈనెల 30 వరకు ఈ ఆన్లైన్ తరగతుల వ్యవహారం నడుస్తుందని తెలిపారు. దీంతో వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సెలవులు ప్రకటించ లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహి స్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరగతులు నిర్వహించే పాఠశాలలపై తగు చర్యలు తీసుకుంటామంటూ అదనపు సంచాలకులు తమకు హామీనిచ్చినట్టు తెలిపారు.