Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిషన్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు ప్రశ్న
- రద్దు చేసింది బీజేపీ.. పద్దులు కేటాయించింది టీఆర్ఎస్
- చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్‌గా చింత ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
- మంత్రి కేటీఆర్, సీపీఐ(ఎం) నేత చెరుపల్లి సహా పలువురి అభినందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేనేత కార్మికులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డిని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రద్దులు తప్ప కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, పవర్ లూమ్ బోర్డులను 2014లో తీసుకొచ్చిన త్రిఫ్ట్స్ ఫండ్ పథకాన్ని కేంద్రం రద్దు చేసిందన్నారు. రద్దులు చేసిన ఘనత బీజేపీకి దక్కింతే పద్దులు కేటాయించిన చరిత్ర టీఆర్ఎస్ది అని చెప్పారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలో టెస్కో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్‌గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం మంత్రులు కేటీ రామారావు, టి హరీశ్‌రావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. హాజరై ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ రోజూ తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి సహాయం చేయకుండా తిరిగి వెళ్తున్నారని విమర్శించారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. కార్మికుల పొట్టకొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు మాటలెక్కువ, చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నదని వివరించారు. రూ.350 కోట్ల నిధులతో బతుకమ్మ చీరల కోసం చేనేత కార్మికులకు ఆర్దర్లించ్చిందని అన్నారు. మరమగ్గాల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని వెల్లడించారు. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా తీసుకొచ్చామనీ, రూ.5 లక్షల బీమా కల్పిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేత కార్మికులకు భరోసా ఇచ్చామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మోడల్ అని అన్నారు. మెగాటెక్స్‌టైల్ పార్కుకు నిధులు ఇవ్వాలంటే కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వేలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో బీమాకు మారుపేరు ఎల్ఐసీ అనీ, దాన్ని ఎందుకు అమ్మాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొని చింత ప్రభాకర్‌ను అభినందించారు.