Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి ఓటర్ల నమోదు ప్రారంభం
- మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్
- ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు షెడ్యూల్ జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కసరత్తును ప్రారంభించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన షెడ్యూల్ను ఈసీఐ శుక్రవారం విడుదల చేసింది. ఈనెల ఒకటి నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల పదిన దినపత్రికల ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ తొలుత ప్రచారం చేస్తారు. ఈనెల 23న దినపత్రికల ద్వారా మరోసారి విజ్ఞప్తి చేస్తారు. ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు తుదిగడువు వచ్చేనెల ఏడో తేదీ వరకు ఉన్నది. అదేనెల 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేస్తుంది. డిసెంబర్ 23న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 29తో తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు ప్రకాశం-చిత్తూరు-నెల్లూరు, కడప- అనంతపురం- కర్నూల్ ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ప్రకాశం- చిత్తూరు - నెల్లూరు, కడప- అనంతపురం- కర్నూల్, విశాఖపట్నం- విజయనగరం - శ్రీకాకుళం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.