Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలి
- సీఎంకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్ధులకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్స్సీ-98లో క్వాలిఫై అయిన అభ్యర్థుల నియామకాలు నేటికీ చేపట్టకపోవడంతో సుమారు 1500 మంది తెలంగాణ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వారికి న్యాయం చేయాలని కోరుతూ పలు సందర్భాంల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరికి ఉద్యోగాలిస్తామని ఎన్నికల సమయంలో సీఎం హామీనిచ్చారని తెలిపారు. 2016 జనవరి మూడున అభ్యర్థులతో ప్రగతిభవన్లో చర్చలు జరిపి, వయో పరిమితితో సంబంధం లేకుండా స్పెషల్ కేసుగా పరిగణించి అవసరమైతే ''సూపర్ న్యూమరీ'' పోస్టులను క్రియేట్ చేసైనా మానవతా దృక్పధంతో న్యాయం చేస్తామంటూ వాగ్ధానం చేశారని గుర్తుచేశారు. ఆయా అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో అప్పటి విద్యాశాఖమంత్రి అధికారికంగా ప్రకటించారు గానీ..అది అమలు నోచుకోలేదని తెలిపారు. 1998 డీఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులందకీ మినిమం టైం స్కేల్ చెల్లింపులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందనీ, కానీ మన రాష్ట్రంలో నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని తెలిపారు.