Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవో 33ను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే వరకు కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరారం నాయక్ పిలుపునిచ్చారు. ఆ జీవో విడుదలకోసం కృషి చేసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను వారు ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా కలిసి అభినందనలు తెలిపారు. ట్రై కార్ చైర్మెన్ రామచంద్రనాయక్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రామ్ బాల్ నాయక్ , టీఆర్ఎస్ ఎస్టీ సెల్ నాయకులు రూప్ సింగ్‌కు కృతఘ్నతలు తెలిపారు. కార్యక్రమంలో టీజీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. బాలు నాయక్ ,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వి .రామ్ కుమార్ నాయక్, ఆర్. శేఖర్ నాయక్, అరుణ్ కుమార్,కిషన్ నాయక్, జానావత్ శ్రీరాం ,నేనావత్ రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం వారి రిజర్వేషన్లను ఆరు శాతం నుండి 10 శాతానికి పెంచాలంటూ గత ఎనిమిదేండ్లుగా గిరిజన , ఉద్యోగ ,విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశారని తెలిపారు. ఫలితంగా రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ పెంపుకు అనుమతులు ఇవ్వకుండా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని విమర్శించారు. దీంతో గత ఎనిమిదేండ్లుగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు జరిగిన అన్యాన్ని గుర్తించటం శుభపరిణామమన్నారు. అన్ని రకాల ఉద్యోగాల నియామకాల్లో జీవో 33ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల్లో సైతం ఆటంకాలు కలుగకుండా చూడాలన్నారు.