Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
- ఢిల్లీలో ముగిసిన ఐదో హెచ్ఏఐ హౌటలీయర్స్ సదస్సు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు రంగ సంస్ధలు, ప్రభుత్వం సమ్మిళిత ప్రయత్నాలతో దేశాన్ని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అపూర్వ అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఐదవ హెచ్ఏఐ హౌటలీయర్స్ కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమకు భరోసా అందిస్తూ, నూతన పర్యాటక విధానాన్ని పార్లమెంట్ సెషన్ ప్రారంభమయ్యే నాటికి అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆతిథ్య, పర్యాటక రంగాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ నూతన విధానం పరిష్కారం చూపుతుందన్నారు. ప్రస్తుతం పరిశ్రమ, పలు మంత్రిత్వ శాఖల నుంచి సూచనలను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. హెచ్ఏఐ అధ్యక్షులు, మేనేజింగ్ డైరెక్టర్-సీఈఓ, ఐహెచ్‌సీఎల్ పునీత చత్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేటు సంస్ధల నడుమ భాగస్వామ్యాలు బాగుంటే పెట్టుబడులు కూడా ప్రోత్సాహకరంగా వస్తాయనీ , లక్షలాది ఉద్యోగాలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, హౌటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ బె జ్బారువా, హెచ్ఏఐ వైస్ ప్రెసిడెంట్ , రాడిసన్ హౌటల్ గ్రూప్ చైర్మెన్ ఎమిరటస్, ప్రిన్సినల్ ఎడ్వైజర్ (దక్షిణాసియా) కెబీ కచ్రు తదితరులు పాల్గొన్నారు.