Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం
- సింగరేణి భవన్లో ఘనంగా సంబురాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ఆడపడుచులు అపురూపంగా జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ అనీ, రాష్ట్ర సంస్కృతికి ఇది దర్పణంగా నిలుస్తుందని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) ఎన్ బలరాం అన్నారు. పేద, ధనిక, వయో భేదాలు అందరూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటారని చెప్పారు. సోమవారం హైదరాబాద్ సింగరేణిభవన్‌లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సింగరేణిలో బతుకమ్మ, దసరా వేడుకలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జీఎం(కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మహిళలు గౌరమ్మను పూజిస్తూ ప్రకతి విపత్తుల నుంచి అందరినీ కాపాడాలని ఆకాంక్షిస్తూ పూజలు చేస్తారన్నారు. ప్రకతి లో లభించే పూలను పూజిస్తూ ఆరాధించే ఏకైక పండుగ ఇదేనన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షులు బి.వెంకట్రావ్, జీఎం(మార్కెటింగ్) ఎం.సురేశ్‌తో పాటు పలువురు సింగరేణి ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.