Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులకు ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలోని వివిధ రీజియన్లలోని డిపోల్లో అప్రెంటీస్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్ధుల నుంచి యాజమాన్యం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంజినీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. శిక్షణ పొందేందుకు అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్రెంటిస్ శిక్షణ పొందడానికి ఇంజనీరింగ్ (బీటెక్, బిఈ), అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (బీ.కాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ) అభ్యర్థులు అర్హులు. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.in లో పేర్కొన్న నిబంధనలు, షరతులకు లోబడి అభ్యర్ధులు ఈ నెల 16 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆన్లైన్లో www.mhrdnats.gov.in వెబ్ పోర్టల్లో టీఎస్ ఆర్టీసీ (యూజర్ ఐడి :STLHDS000005) లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.