Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరి ఫోన్లనూ ట్యాప్ చేయిస్తున్నది : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'పార్టీ పెట్టకముందే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టు..కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ సీఎం, కవిత కేంద్ర మంత్రి అయినట్టు కల్వకుంట్ల కుటుంబం పగటి కలలు కంటున్నది' అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నేతలవే కాదు టీఆర్ఎస్ నాయకులవీ, అధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీపై విషప్రచారం చేయడ మే కేసీఆర్ కుటుంబం పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. కేసీఆర్ ఎవర్ని ఉద్దరించడానికి జాతీయ పార్టీ పెడుతున్నారని ప్రశ్నించారు. ఆయన ప్రకటన చూసి ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారన్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసేందుకు కేసీఆర్ వెళ్తే ఆయన చేత లు, మాటలు చూసి ఎవ్వరూ దగ్గరకు రానివ్వడం లేదన్నారు. ఎంఐఎం ని బలపర్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని ఆరోపించారు. నెగిటివ్ ఆలోచనా విధానంతో వచ్చిన ఏ పార్టీ కూడా బతికి బట్టకట్ట లేదన్నారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుండటం తోనే సీఎం జాతీయపార్టీ పల్లవి ఎత్తుకున్నారని విమర్శించారు. కల్వ కుంట్ల కుటుంబానికి కలలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలే గుర్తుకు వస్తున్నాయన్నారు. దళితున్ని సీఎం చేస్తానని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో ఎంఐఎం, వైసీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఏఐఏడీఎంకే కూడా జాతీ య పార్టీలేననీ, జాతీయ పార్టీలు పుట్టుకురావడం, పోవడం సాధారణ మేనని చెప్పారు. మోటార్లకు మీటర్లుపై టీఆర్ఎస్ విషప్రచారానికి పూనుకున్నదన్నారు. తమ ప్రభుత్వం మీటర్లు పెడతామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆయనే కల్వకుంట్ల కుటుంబం అవినీతికి మీటర్లు కచ్చితంగా పెడతామని ఎద్దేవా చేశారు.