Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ ఫుడ్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్, క్యాజువల్ ఉద్యోగులకు 20 శాతం అలవెన్సులు పెంచేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అమోదం తెలిపినట్టు ఆ సంస్థ చైర్మెన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. ఎమ్ఎమ్డబ్ల్యూలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు కూడా ఆమోదం లభించిందన్నారు. సోమవారం టీఎస్ ఫుడ్స్‌లో హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.