Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నకిలీ డాక్టర్ల నుంచి ప్రజారోగ్యాన్నికాపాడాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సోమవారం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో డాక్టర్లు పెద్ద ఎత్తున ఈ నిరసనల్లో పాల్గొన్నారు. అనర్హులను ప్రోత్సహించే చర్యలను మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నేడు మంత్రితో సమావేశం
ఈ నెల 16 వరకు దశల వరీగా పోరాటానికి డాక్టర్ల సంఘాలు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. నిరసనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. టీఎస్ఎంసీ చైర్మెన్ డాక్టర్ రాజలింగం, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్ మధ్యవర్తిత్వంతో చర్చలకు ఆహ్వానమందిందని జూడా ప్రతినిధులు తెలిపారు. మంగళవా రం డాక్టర్ల సంఘాల నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేయిస్తామని వారు తెలిపినట్టు వెల్లడించారు.