Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యత కోసం : దిగ్విజయ్ సింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత్ జోడో యాత్ర రాజకీయాల కోసం కాదనీ, దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకే యాత్ర నిర్వాహకులు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన యాత్ర సన్నాహాక సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 13 రోజుల పాటు సాగే యాత్రలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ వరకు నిర్వహిస్తున్న యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు. బీజేపీ సామాన్యులపై విపరీతమైన భారాలను వేసిందని విమర్శించారు. తెలంగాణను కాంగ్రెస్ ఇస్తే ఆ పార్టీనే దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.