Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆ' అవకాశం వస్తుంది : చిరంజీవి
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ నటుడు చిరంజీవి పరోక్షంగా అన్నారు. గాడ్‌ఫాదర్ సినిమా విడుదల సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో చిత్ర యూనిట్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ 'ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కల్యాణ్‌కు పరిపాలించే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం వస్తుంది. అలాంటి రోజు రావాలని భావిస్తున్నా.' అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడు అవసరం ఎంతైనా ఉందని చెప్పిన చిరంజీవి తన తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అటువంటి లక్షణాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ, నాయకులను ఉద్దేశించి గాడ్‌ఫాదర్ సినిమాలో డైలాగ్‌లు వేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఒరిజినల్ కథ ఆధారంగానే డైలాగ్‌లు రాశామని, ఎవరైనా భుజాలు తడుముకుంటే ఏమీ చేయలేనని అన్నారు.