Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లాలనుకోవడం శుభపరిణామమనీ, ఆయన అక్కడ కూడా విజయం సాధించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమారస్వామి అన్నారు. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన రాణించి ప్రధానమంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించేందుకు కోర్‌కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌కుమారస్వామి మాట్లాడుతూ సీపీఎస్ రద్దుకోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈనెల తొమ్మిది నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మూడు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరిగేలా దాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు ప్రకటించారు.
సెక్రెటరీ జనరల్‌గా జి నిర్మల
తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌గా జి నిర్మల, ప్రధాన కార్యదర్శులుగా పి పురుషోత్తం, సిహెచ్ ఆదిత్య, యూఎఫ్ఏ యాకుబ్‌పాష, జాజుల రంజిత్, అదనపు ప్రధాన కార్యదర్శులుగా వంకడోత్ హాతిరాం నాయక్, రాష్ట్ర కో ఆర్డినేటర్లుగా వేముల రాధిక సురేందర్‌రెడ్డి, హరాలే సుధాకర్ రావు, కె జయలక్ష్మి, బొడ్డు ప్రసాద్‌ను ఎంపిక చేశామని సంపత్‌కుమారస్వామి వివరించారు. ఈ కార్య్రమంలో కోశాధికారి గడ్డం బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.