Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కాంగ్రెస్పార్టీ అధికారిక ప్రతినిధి, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్ టీఆర్ఎస్పార్టీలో చేరారు. రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించాననీ, కాంగ్రెస్పార్టీ నూతన అధ్యక్షుని వ్యవహారశైలి నచ్చక టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తనతోపాటు మరికొందరకు బీసీ నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరినట్టు వెంకటేశం గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు.