Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జాతిపిత మహాత్మాగాంధీని అవమానపర్చిన హిందూ మహాసభను తక్షణం నిషేధించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహనిర్మాణ సంస్థ చైర్మెన్ కోలేటి దామోదర్ డిమాండ్ చేశారు. కోల్కతాలో దుర్గామాత మండపంలో మహాత్మాగాంధీని మహిషాసురుడిగా మార్చడం దుర్మార్గచర్య అని మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల మహాత్ముడి ప్రాభవానికి ఎలాంటి నష్టం జరగదనీ, ఆయన సార్వజనీన నాయకుడనీ కొనియాడారు.