Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పటిష్టంగా ఏర్పాట్లు చేయండి
- అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలి గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాతపరీక్ష ఈనెల 16న జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. కరోనా నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే పనిలో అధికారులు నిమగమయ్యారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.