Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా పోరాటం ఫలించింది : జీఎంపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పేర్కొన్నారు. తమ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నగదు బదిలీకి పైలెట ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గాన్ని ఎంపిక చేశారని తెలిపారు. సుమారు 5,800 మంది గొల్ల కురుమల అకౌంట్లలోకి రూ.1.58 లక్షల చొప్పున నగదు బదిలీ అయిందని పేర్కొన్నారు. అయితే, గొల్లకురుమలు డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా ప్రీజింగ్ పెట్టడం సరిగాదని సూచించారు. నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. వారి సంతకాలతో మాత్రమే గొర్రెల అమ్మకందార్లకు డబ్బులు బదిలీ చేసే ఏర్పాటైనా చేయాలని సూచించారు. మొదటి విడతలో జరిగిన అక్రమాలను ఎండగడుతూనే నగదు బదిలీ డిమాండ్‌పై తమ సంఘం దశలవారీగా చేసిన పోరాటాలను వివరించారు. సహకరించిన యాదవ, కురుమ సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ప్రజా ప్రతినిధులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.