Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్రమంత్రి జి కిషన్రెడ్డి ఇటీవల ప్రకటన చేశారని గుర్తు చేశారు.ఉక్కు కర్మాగారం స్థాపనకు ఇనుప ఖనిజం సమృ ద్ధిగా ఉన్న తెలంగాణాలోని అవిభక్త ఖమ్మం జిల్లా ప్రజలందరినీ ఇది దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఆ చట్టంలో తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, సంబంధిత స్టేక్ హోల్డర్లతో కానీ ఎలాంటి చర్చలు జరపకుండా కిషన్రెడ్డి ఏకపక్షంగా ప్రకటన చేయడం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. గతంలో జీఎస్ఐ నివేదిక ప్రకారం బయ్యారంలో 300 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఇనుప ఖనిజం లభ్యత ఉందని తెలిపారు. 2017లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి బీరేందర్సింగ్ రాష్ట్రంలోని పాల్వంచలో పర్యటించిన సందర్భంగా ఉక్కు కర్మాగా రాన్ని మంజూరు చేస్తామనీ, అది సాధ్యం కాకపోతే త్వరలోనే బెనిఫికేషన్ ప్లాంట్ లేదా పెల్లెటైజేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.