Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే..:విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా వచ్చినా మునుగోడులో అడ్డా వెయ్యలేరని, మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థే అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో మంత్రి శనివారం పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్ని కుయుక్తులు రచించినా.. ఎంత డబ్బు పంచినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అని చెప్పారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. గతంలో మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఇంకా మునుగోడు అభివృద్ధిలో ముందుకు సాగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని రాజగోపాల్‌రెడ్డి.. ఇపుపడు బీజేపీలో చేరి ఏం చేస్తాడో ప్రజలే ఆలోచన చేసుకోవాలని సూచించారు. బీజేపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, బంగారు తెలంగాణని మతోన్మాదుల చేతిలో పెట్టొద్దని కోరారు. ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లెంకలపల్లి సర్పంచ్ పాక నగేష్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.