Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు :టీడబ్ల్యూజేఎఫ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10వ తేదీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు 'డిమాండ్స్ డే' నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 35 ఏండ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని చెప్పారు. కనీసం ఇప్పుడైనా ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా తమకు ఇండ్లు, ఇండ్లస్థలాలు వస్తాయని ఆశించిన జర్నలిస్టులకు ఎనిమిదేండ్లుగా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము గత కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరిని అనుసరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు ఇవ్వ డమే తప్ప, ఆచరణలో అమలుచేయలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'డిమాండ్స్ డే'ను చేపడుతున్నట్టు వివరించారు.