Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయక శ్రేణి పూర్తిగా అనారోగ్యపాలైంది
- కొత్త క్యాడర్‌కు సిద్ధాంతపరంగా అవగాహన లేదు
- మావోయిస్టు నాయకురాలు ఉష లొంగుబాటు ప్రెస్ కాన్ఫరెన్సులో డీజీపీ వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నాయకత్వ లోపంతో మావోయిస్టు పార్టీ తనకుతానుగానే కుప్పకూలిపోతున్నదని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి అన్నారు. మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌జోన్ కమిటీ సభ్యురాలు, సిద్ధాంత స్కూల్ టీచర్ అయిన ఉషా శనివారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో నాయకశ్రేణి క్రమంగా క్షీణించిపోయిందనీ, ఉన్నవారు తీవ్ర అనారోగ్యాలపాలయ్యారని అన్నారు. కరోనా కారణంగా ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించగా, మరో ఆరుగురు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారనీ, మరో 11 మంది తెలంగాణకు చెందిన నాయకులు కేంద్ర కమిటీలో ఉన్నారని ఆయన వివరించారు. మావోయిస్టు నాయకులు జంపన్న, సుధాకర్‌లు లొంగిపోయాక పార్టీలో నాయకత్వం మరింతగా క్షీణించిపోయిందనీ, ఈ విషయాన్ని లొంగిపోయిన ఉష కూడా అంగీకరించిందని డీజీపీ తెలిపారు. కొత్తగా చేరే క్యాడర్‌కు సిద్ధాంతాలను నూరి పోసే నాయకత్వం పూర్తిగా బలహీనపడిందనీ, దాంతో పార్టీలోకి కొత్తవారు చేరినా.. ఎంతోకాలం మనుగడ సాగించలేక పారిపోతున్నారని డీజీపీ పేర్కొన్నారు.