Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, టీఆర్ఎస్పై రేవంత్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరుధ్యం ఉన్నట్టు ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామన్న బీజేపీ నేతల మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ తమను వేధిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్ దోపిడీని మోడీ, అమిత్షా, కేంద్ర మంత్రులు ప్రస్తావిస్తున్నారనీ, కానీ అది వాస్తవం కాదని తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో సమగ్ర వివరాలతో తాను ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయడం నేరమని చెప్పారు. అలాంటి వసూళ్లు లంచం తీసుకోవడంతో సమానమనీ, ఈ విషయంపై ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. పార్టీ చందాలు వసూలు చేశారంటూ కేసును క్లోజ్ చేశారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘ నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దనీ, 20వేల కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దన్నారు. దీనిపై తాను ఎన్నికల సంఘాన్నీ కలిసి కేసుల తీసుకోవాలని కోరాను. వసూళ్లపై విచారణకు సిబ్బంది లేదంటూ ఎన్నికల సంఘం తెలిపిందన్నారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తే, హోంమంత్రికి పంపించారని తెలిపారు. ఐదేండ్లుగా వందల కోట్లు వసూలు చేస్తున్న ఆర్థిక నేరగాళ్లు కేసీఆర్ ఒక ఆర్ధిక ఉగ్రవాది అనీ, ఆయనపై కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే పార్టీ పేరు మారుస్తున్నారని ఆరోపించారు.రాజ్యసభలో టీఆర్ఎస్ పీపీ బీజేపీలో విలీనం అవ్వబోతుందన్నారు.