Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్‌ను తిరిగి ఎన్నుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. బుక్ ఫెయిర్ సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో 2022-23గాను ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఉపాధ్యక్షులుగా కోయ చంద్రమోహన్, పి నారాయణరెడ్డి, కార్యదర్శిగా శృతికాంత్ భారతి, సహాయ కార్యదర్శిగా శోభన్‌బాబు, కోశాధికారిగా పి రాజేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కవి యాకూబ్, ఎన్ మధుకర్, బి నర్సింగ్ రావు, ఎ జనార్దన్గుప్తా, విజయరావు, కె బాల్‌రెడ్డి, ఆర్ శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. మాటూరి సూర్యనారాయణ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు