Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణిలో లోపాలను సవరించి భూసమస్యలు పరిష్కరించాలి : టి.సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌లోని లోపాలను సవరించి భూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యా లయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రకటించారు. ఈ ఆందోళనలను జయ ప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. శని వారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. అరిబండి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణతో కలిసి ఆయన ధర్నా కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులుండగా లక్షలాది మంది రైతులకు నేటికీ పాసు పుస్తకాలు ఇవ్వలేదని తెలిపారు. వాటికోసం రైతులు తహసీ ల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పా రు. పాసుబుక్కులందని వారు రైతుబంధు, రైతుబీమా, రుణ సౌకర్యం, రుణమాఫీ లాంటి ప్రభుత్వ పథకాల కు దూరం కావాల్సివస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశా రు. రైతుల పోరాట ఫలితంగా ఆర్ధికమంత్రి టి. హరీష్‌రావు నాయకత్వాన ఏర్పడిన కమిటీ పరిశీలిం చి ధరణిలో 20 రకాల లోపాలను గుర్తించిందని తెలిపారు. మూడు నెలల కింద 13 లోపాలను సవ రించడానికి ఓ మాడ్యూల్‌ను రూపొందించిందనీ, నాలుగు లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసు కున్నారని తెలిపారు. మిగిలిన ఏడు లోపాలకు కూడా మాడ్యూల్స్ రూపొందించి సమస్యను పరిష్కరించా లని కోరారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుడు రికార్డులవలనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని విమర్శించారు. రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు రైతులు జరిమానా చెల్లించాల్సి వస్తున్నదన్నారు. సాదా బైనామాలను విచారించి అర్హులందరికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజాదర్బార్లు పెట్టి తప్పుడు రికార్డులను సరి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ అని కొత్త పథకాన్ని అమలు జరుపు తూ అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కుంటున్న దని విమర్శించారు. అసైన్డ్ పట్టాదారుకు ఎకరానికి 400 గజాలు మాత్రమే ఇచ్చి మిగతా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నదని చెప్పారు.