Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా చెన్నకేశవరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డికి పీఆర్టీయూటీఎస్ షాక్ ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిచారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇవ్వకుండా ఆ సంఘం నిరాశకు గురిచేసింది. ఈసారి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘ నియమావళి ప్రకారం 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మెజార్టీ సభ్యుల ఆమోదంతో చెన్నకేశవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆయన 2017-18 కాలంలో ఈ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని పేర్కొన్నారు. అంతకుముందు 2011 నుంచి 2017 కాలంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, టీటీజేఏసీ చైర్మెన్‌గా పనిశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పిఎల్ నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.