Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీలు నష్టపోకుండా చూడాలి
- రాష్ట్ర నేతలతో చంద్రబాబు భేటి
- మునుగోడుపై త్వరలో నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిథి -హైదరాబాద్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైతేనే బడుగులకు భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు .ఆదివారం హైదెరాబాద్లోని అయన నివాసంలో తెలంగాణ ముఖ్య నాయకులు, మునుగోడు నియోజకవర్గ నాయకులతో మునుగోడు ఉప ఎన్నికపై సమావేశమయ్యారు ఈ సందర్భంగా మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీపై చర్చించారు. అక్కడ స్థానికంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతం కోసం పాటుపడుతున్న జక్కలి ఐలయ్య యాదవ్ ను పోటీలో దింపాలని నియోజకవర్గ నాయకులు విన్నవించారు. ఇందుకు చంద్రబాబు మాట్లాడుతూ మునుగోడులో పోటీ చేసిన మూడుసార్లు గెలుపు ఓటమికి సంబంధం లేకుండా బీసీలకు అవకాశం కల్పించి నాయకత్వాన్ని ప్రోత్సహించామని చెప్పారు . టీడీపీ బలహీనపడితే తెలంగాణ ప్రాంతంలో బీసీలు రాజకీయంగా బలహీనపడుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. 2023 ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని , అందుకు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఫ్లోరిన్ ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గానికి కష్ణా జలాలను తాగునీరుగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఏ అభివద్ధి చేసిన టీడీపీ హయంలో జరిగిందేనని
గుర్తు చేశారు. మునుగోడులో పార్టీ చేస్తున్న కార్యక్రమాలను వివరించగా స్థానిక నాయకత్వాన్ని అభినందించారు .మీ కార్యక్రమాలని కొనసాగించండి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు . ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి , అరవింద్ కుమార్ గౌడ్ , నన్నూరు నర్సిరెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ .మునుగోడు నియోజకవర్గ నాయకులు బడుగు లక్ష్మయ్య , మక్కని అప్పారావు , ఎండీ హన్ను బారు. వహీద్ తదితరులు పాల్గొన్నారు.