Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలు సోమవారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరంలో గతనెల 25(ఆదివారం)తో కలిపి 26 నుంచి ఆదివారం వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు సైతం సోమవారం నుంచి పున:ప్రారంభమవుతాయి.