Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలాస విశ్వనాథం ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ మూర్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ ఉచితంగా ఇస్తామని ఇంజినీర్ పొలాస విశ్వనాథం ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ పొలాస మూర్తి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం చేస్తామని వివరించారు. ఈ ఏడాది నీట్ యూజీ-2023కి సన్నద్ధమవుతున్న ప్రతిభావంతు లైన పేద విద్యార్థుల్లో 25 మందికి అడ్వాన్స్డ్ బ్లాక్ బోర్డ్ (ఏబీబీ) అకాడమిలో ఉచితంగా లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తామన్నారు. ఈ అకాడమిలో గతేడాది కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 50 మంది మెడికల్ సీట్లు సాధించారని అన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నీట్ యూజీ-2022లో ఎస్సీలు 300, ఎస్టీలు, బీసీలు, ఈడబ్ల్యూఎస్తోపాటు మైనార్టీలు 350 స్కోర్ సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులని వివరించారు. అడ్వాన్స్డ్ బ్లాక్ బోర్డ్ అకాడమి డైరెక్టర్ పి వెంకటర మణ మాట్లాడుతూ తమ సంస్థలో నిష్ణాతులైన అధ్యాపకులున్నారని చెప్పారు. ఇతర వివరాల కోసం 9248563816, 9299708120, 863981 0639 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొలాస విశ్వనాథం ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్లు పొలాస రమ, పరమేశ్వర్, వీణ, సభ్యులు రేఖ తదితరులు పాల్గొన్నారు.