Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తొలి గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. హాల్టికెట్లను అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ టైప్)ను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 16 వరకు హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేశామని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,040 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది.