Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి గడువును ఈనెల 14తేదీ వరకు పొడిగించామంటూ మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసం స్థల కార్యదర్శి మల్లయ్య బట్టు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వరుసగా సెలవులు రావటంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారనీ, వారి అభ్యర్థన మేరకు దరఖాస్తు తేదీని పొడిగించామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ బీజడ్సీ, ఎంపీసీ, కంప్యూటర్ సైన్స్, బీఏ హెచ్ఈపీ కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్, మెషిన్ లెర్నింగ్, బీబీఏ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియాలజీ, బిజినెస్ అన లిటిక్స్, జియోగ్రఫీ, డాటా సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రి షన్ అండ్, డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-23328266, myptbcwreis.telangana.gov.inను సంప్ర దించాలని ఆయన సూచించారు.