Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీఏలో సీట్లు 2,370
- నేటినుంచి ఐసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 14,284 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12 వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశముందని తెలిపారు. సోమవారం నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. పది నుంచి 15 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈనెల 18న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అదేనెల 21 వరకు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలనీ, ట్యూషన్ చెల్లించాలని సూచించారు. ఎంబీఏలో 231 కాలేజీల్లో 20,481 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇందులో 22 విశ్వవిద్యాలయ, ప్రభుత్వ కాలేజీల్లో 1,518 సీట్లు, 209 ప్రయివేటు కాలేజీల్లో 18,963 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఎంసీఏకు సంబంధించి 16 విశ్వవిద్యాలయ, ప్రభుత్వ కాలేజీల్లో 900 సీట్లు, 24 ప్రయివేటు కాలేజీల్లో 1,470 సీట్లు కలిపి 40 కాలేజీల్లో 2,370 సీట్లున్నాయని వివరించారు. ఇతర వివరాలకు https://tsicet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.