Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడులో తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ ఈసీకి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆరోపించారు. రాజకీయ నైతికతకు కట్టుబడి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. అనని మాటలను అన్నట్టుగా వీడియోలను మార్ఫింగ్ చేసి అయన మీద దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలని మునుగోడులో ఖర్చుపెట్టబోతున్నదని ఆరోపించారు.