Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీల హక్కుల కోసం చిన్నతనం నుంచే పోరుబాట పట్టిన గొప్ప యోధుడు కొమురం భీం అని గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆదివారం మంత్రి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన భీమ్ ఆదివాసీల ఆరాధ్యదైవమన్నారు.గిరిజన ప్రజల కోసం,వారి బానిసత్వపు సంకెళ్లను తెంచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని తెలిపారు. కొమురం భీమ్ ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. 'మా తండాలో మా రాజ్యం' అనే ఆయన నినాదాన్ని నిజం చేసింది తమ ప్రభుత్వమేనని అన్నారు. తండాల ను గ్రామ పంచాయతీలు మార్చాలన్న సుదీర్ఘకాల డిమాండ్ ను నెరవేర్చి గిరిజనులకు తండాలో పాలనాధికారాన్ని అందించిన నేత సీఎం కేసిఆర్ అని వివరించారు. అన్నారు.అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీకైన కొమురంభీం పోరాట స్పూర్తితో గిరిజనుల అభివృద్ధికోసం పనిచేస్తామని తెలిపారు.