Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ప్రచారానికి డుమ్మా కొట్టేందుకే..!
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వస్తారా? రారా? లేక విదేశీ పర్యటనకు వెళతారా? అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తరుపున మునుగోడు బరిలో ఉండడం, తాను కాంగ్రెస్‌లో కొనసాగుతుండటంతో ఇలాంటి ప్రచారానికి తెరలేచింది. కాంగ్రెస్ స్టార్ క్యాయింపెనర్గా ఉన్న ఆయన...తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేక, పార్టీ క్యాడర్ ఒత్తిడిని తట్టుకోలేక మూడు, నాలుగు రోజుల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు పయనమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే తన ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రచారాన్ని ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించకపోవడం ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ సభ్యుల సమావేశంలో కోమటిరెడ్డిని ఎన్నికల ప్రచారానికి రప్పించాలనీ, లేకపోతే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కొంత మంది డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును సూచించిన వెంకట్‌రెడ్డి...ఆమె ప్రచారానికి మాత్రం దూరంగా ఉండటంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఎడమొహం,పెడమొహంగా ఉండటతో పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదే అంశంపై రేవంత్‌రెడ్డిని ప్రశ్నించగా, ప్రచారానికి కోమటిరెడ్డి వస్తారనీ, ఆయనతో ఏఐసీసీ నేతలు మాట్లాడుతున్నారంటూ వివరణ ఇవ్వడం గమనార్హం.
కేటీఆర్ ప్రకటన రాజకీయ జిమ్మిక్కు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన రాజకీయ జిమ్మిక్కు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ లబ్దిపొందాలని చూడటం హుందా రాజకీయం అనిపించుకోదని విమర్శించారు. ఈమేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
మా వద్ద చెప్పులు లేవా? :బీజేపీ నేతలకు జగ్గారెడ్డి కౌంటర్
రాహుల్‌గాంధీ ఫోటోని చెప్పులతో కొట్టాలంటూ కర్ణాటక బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. మా వద్ద చెప్పులు లేవా? అని హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాడ్సేను పొగిడిన బీజేపీ నేతలది తప్పు కాదా?అని ప్రశ్నించారు.