Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో వున్న సాగునీటి ప్రాజెక్టుల పనులను సత్వరం పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. తమ నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు సమావేశంలో వివరించారు. జిల్లాలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయనీ, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రబుత్వం పలు ప్రాజెక్ట్ లు, బ్యారేజీలు, లిఫ్ట్ ఇరిగేషన్, చెక్ డ్యాంల నిర్మాణానికి పెద్ద పీట వేసిందని తెలిపారు. వాగులు, వంకలపై రెండో దశలో మరిన్ని చెక్ డ్యాంలు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు. నియోజకవర్గాల వారీగా చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించి, నవంబర్ లేదా డిసెంబర్ వరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.