Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 11 నుండి 15వ తేదీ వరకు జరిగే శ్రీ వేంకటేశ్వరా వైభవోత్సవాల క్రతువుకు సోమవారం అంకురార్పణ జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ దాతలు హర్షవర్ధన్, ఎస్ఎస్.రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైదిక క్రతువుల్లో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, వాస్తుశాంతి, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. అలాగే మంగళవారం నుంచి తిరుమల నమూనా ఆలయంలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.