Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ మంత్రాలతో చింతకాయలు రాలవు. టీఆర్ఎస్ తంత్రాలతో ప్రజల సమస్యలు తీరబోవని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ఆ రెండు పార్టీల చీకటి దోస్తానా ప్రజలకు అర్థమైపోయిందని తెలిపారు. ఇలాంటి గజకర్ణ గోకర్ణ టక్కు టమార డ్రామాలు మాని పరిపాలన, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు.