Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈఓకు టీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉపెన్నికకు సంబంధించి కారును పోలిన ఎనిమిది గుర్తులున్నాయనీ, వాటిని తక్షణం తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్,టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని బుద్ధ భవన్లో సీఈఓ వికాస్ రాజ్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కారును పోలిన గుర్తువల్ల స్వల్ప మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే సీఎం కేసీఆర్‌పై క్షుద్రపూజలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.ఆయన పిచ్చి కుక్క కంటే అధ్వాన్నంగా తయ్యారయ్యాడని విమర్శించారు.