Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి మంత్రి ఎర్రబెల్లి సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రధాని మోడీని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ కేంద్రం అమలు చేయలేదన్నారు. గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...బీజేపీకి, ఆ పార్టీ నేతలకు ఇచ్చిన మాటను తప్పటం అలవాటని ఎద్దేవా చేశారు. తన మంత్రిత్వశాఖ (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) పనితీరుకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ నిధులు మాత్రం రాలేదన్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం... ఆ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.800 కోట్లలో కోత విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇంతలా అన్యాయం చేసిన మోడీ... ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారంటూ ఎర్రబెల్లి విమర్శించారు.