Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంటీ, పీఈటీ పరీక్షలు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సాగుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియలో ప్రాధమిక పరీక్షలో పాసైన అభ్యర్థులకు రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో దేహధారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షను పాసైన అభ్యర్థులు బోర్డు ఆదేశాల మేరకు రెండవ ఫైనల్ ఆన్లైన్ దరఖాస్తులను నమోదు చేసుకున్నారు. వీరికి ఇచ్చిన గడువు బుధవారం పదవ తేదీ తో ముగిసింది. కాగా మొత్తం 237862 మంది అభ్యర్థులు తమ ఫైనల్ దరఖాస్తులను బోర్డు తెలిపిన నిబంధనల మేరకు నమోదు చేశారని ఈ విభాగం చైర్మెన్ వీవీ శ్రీనివాసరరావు గురువారం తెలిపారు. కాగా ఇందులో ఏదేని తప్పులు దొర్లిన చో వాటిని తిరిగి సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని ఇస్తామని ఆయన తెలిపారు. కాగా ప్రిలిమినరీ టెస్ట్ పాసైన అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ పరీక్షలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, అదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మొదలైన పదకొండు జిల్లాల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను 25 పని దినాల్లో ముగిస్తామని ఆయన తెలిపారు.