Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్‌కు దిగువ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. అన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సెక్షన్ 41 ఎ కింద నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందనీ, ఈ కేసులో సుప్రీం ఉత్తర్వులు వెలువడే వరకు రాజాసింగ్ కేసును వాయిదా వేయాలని కోరింది. అందుకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన బెంచ్ అనుమతిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
సికింద్రాబాద్ క్లబ్ చైర్మెన్‌పై చర్యల నిలిపివేత
సికింద్రాబాద్ క్లబ్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో ఆ క్లబ్ చైర్మెన్ రఘురామ్‌రెడ్డికి దిగువ కోర్టు జారీ చేసిన సమన్ల అమలును నిలిపేస్తూ హైకోర్టు స్టే విధించింది. బ్రిటీష్ కాలం నాటి క్లబ్లో ఈ ఏడాది జనవరి 16న అగ్నిప్రమాదం సంభవించటంతో భారీ నష్టం వాటిల్లింది. 1878 నాటి ఫర్నీచర్ కాలిపోయింది. దీంతో క్లబ్ చైర్మెన్‌పై పోలీసులు నమోదు చేసిన కేసులో కింది కోర్టు సమన్లు ఇచ్చింది. దీనిపై ఆయన సవాల్ చేసిన రిట్‌ను జస్టిస్ సుమలత విచారించి సమన్లపై స్టే విధించారు.