Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఫార్మ్‌హౌస్‌లో డబ్బులు దొరికినట్టు ఇప్పటిదాకా చూపెట్టలేదని తెలిపారు. విచారణను నిర్వీర్యం చేయడానికే సిట్‌ను వేశారని విమర్శించారు. కేసు కోర్టులో ఉండగా సిట్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఫార్మ్‌హౌస్ కేసులో కర్త,కర్మ, క్రియ అంతా టీఆర్ఎస్ వాళ్లేననీ, ఓటుకు నోటు కేసులోని అనుభవాన్ని ఇక్కడ వాడుకున్నారని విమర్శించారు. విచారణ నిలుపుదల చేయాలని తమ పార్టీ కోర్టుకెళ్లలేదని చెప్పారు. సిట్టింగ్ జడ్జితోనైనా, సీబీఐతోనైనా విచారణ జరపాలని కోర్టు మెట్లెక్కామని తెలిపారు.